అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో, చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ పోస్టర్లో ఆమె లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ఆమె , మహారాజు వేషధారణలో, మీసకట్టుతో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. సాధారణంగా హీరోయిన్ల బర్త్ డే పోస్టర్లు గ్లామరస్‌గా ఉంటాయని ఆశించే ప్రేక్షకులకు, చిత్ర యూనిట్ ఈ వైవిధ్యమైన లుక్‌తో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈసినిమాలో ఆమె ‘భారతి’ అనే పాత్రలో కనిపించనుండగా ఈ గెటప్ వెనుక ఏదైనా నాటక రంగ నేపథ్యం ఉందా లేదా కథలో ఏదైనా కీలక మలుపు ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.
మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా పల్లెటూరి నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా, భాగ్యశ్రీ బోర్సే లుక్ ఆ అంచనాలను మరింత పెంచుతోంది. ఈ చిత్రం జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























