భోగిలో కందుల సులోచన రాణిగా అనుపమ పరమేశ్వరన్

Bhogi Features Anupama Parameswaran as Kandula Sulochana Rani

చార్మింగ్ స్టార్ శర్వా, డైరెక్టర్ సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా ‘భోగి’. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. శర్వా కెరీర్‌లో అత్యంత భారీ స్థాయి ప్రాజెక్టులలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌, శర్వా పుట్టినరోజు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. వీటికి అద్భుతమైన స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మేకర్స్ అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ ‘కందుల సులోచన రాణి’గా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అనుపమ పల్లెటూరి యువతిగా సహజసిద్ధమైన లుక్‌లో కనిపిస్తుంది. దుమ్ముతో నిండిన గ్రామీణ మార్గంలో కాలిబాటగా నడుస్తూ, తలపై ఆకులతో నిండిన పెద్ద బుట్టను మోస్తూ, చేతిలో మరికొన్ని ఆకులు, టిఫిన్ డబ్బాతో కనిపించడం ఆకట్టుకుంది.హాఫ్ శారీ, ఫేడెడ్ బ్లౌజ్‌తో ఆమె లుక్ పూర్తిగా రస్టిక్ ఫీల్‌ను ఇస్తోంది. ఆమె లుక్ లో ఇంటన్సిటీ పాత్ర బలాన్ని సూచిస్తోంది. బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే మట్టి ఇళ్లు, కంచెలు, పశువులు— అసలైన గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపిస్తున్నాయి.

మోదుగ ఆకులు తో ఆకుపళ్లెం తయారు చేస్తూ జీవనం సాగించే సులోచన పాత్రలో అనుపమ పూర్తిగా లీనమయ్యారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ పాత్రలో ఆమె సహజత్వం, ధైర్యం, బలం ప్రతిబింబిస్తున్నాయి. గంగా అనే తుఫాన్‌లాంటి పాత్రకు ఆత్మలా నిలిచే సులోచన ఈ కథలో కీలక పాత్రగా ఉండనుంది. ఈ పాత్ర కోసం అనుపమ డైలెక్ట్, డిక్షన్, ఎమోషనల్ న్యూయాన్స్‌లను ఎంతో కచ్చితంగా ప్రాక్టీస్ చేసి, నిజమైన అనుభూతిని తీసుకొచ్చారు.

ఇప్పటికే రాజమహేంద్రవరం, రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో హైదరాబాద్ పరిసరాల్లో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో డింపుల్ హయాతి మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 1960ల నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో సాగే ఈ కథ యాక్షన్, భావోద్వేగాలతో నిండిన పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది.

‘భోగి’టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. కిరణ్ కుమార్ మన్నె ప్రొడక్షన్ డిజైన్, కిషోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రం రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.