ఈద్ కి రానున్న సల్మాన్ – వంశీ పైడిపల్లి మూవీ

Eid Release Locked for Salman Khan–Vamshi Paidipally Movie

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు టాలీవుడ్ హిట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం గురించి తాజా అప్‌డేట్ వెలువడింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ (SVC 63) ఈద్ 2027 కానుకగా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సల్మాన్ ఖాన్ ఈ రోజు (ఏప్రిల్ 24, 2026) స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. “కొంచెం ముందుగానే ఆలోచించాలి, అందుకే ఈద్ అని ప్రకటించాను” అంటూ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ‘జవాన్’ తర్వాత ఆమె నటిస్తున్న రెండో బాలీవుడ్ చిత్రం ఇది.వంశీ పైడిపల్లి ఈ సినిమాతో ఆయన బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

ఈ వారం ప్రారంభంలోనే ముంబైలో ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు మరియు షూటింగ్ ప్రారంభమయ్యాయి. సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్‌లో సెట్స్‌లోకి అడుగుపెట్టిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

మరోవైపు, సల్మాన్ ఖాన్ నటించిన మరో చిత్రం ‘మాతృభూమి’ (గతంలో బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అని పిలిచేవారు) 2026 లో విడుదల కానుంది. అయితే, వంశీ పైడిపల్లితో చేసే సినిమాను మాత్రం సల్మాన్ తన ఫేవరెట్ రిలీజ్ డేట్ అయిన ఈద్ కోసం, అంటే 2027 మే నెలకు లాక్ చేశారు.

వంశీ పైడిపల్లి ఎమోషనల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్లను తీయడంలో దిట్ట కావడంతో, సల్మాన్ ఖాన్‌ను ఆయన ఎలా చూపిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.