రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘డార్లింగ్’ 4K వెర్షన్ రీ-రిలీజ్‌లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్‌వైడ్ గా ₹7.59 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం హైదరాబాద్‌లోనే ₹1.64 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రభాస్ స్టామినాను నిరూపించింది. టాలీవుడ్ రీ-రిలీజ్ చరిత్రలో ‘బాహుబలి: ది బిగినింగ్’ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన రెండో చిత్రంగా ‘డార్లింగ్’ రికార్డు సృష్టించింది.
మొదటి రోజే సుమారు 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. బుక్ మై షోలో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ₹2.8 కోట్ల మేర వసూళ్లు రావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ల వద్ద ప్రభాస్ అభిమానుల సందడి అంబరాన్నంటింది. చాలా చోట్ల ‘హౌస్‌ఫుల్’ బోర్డులు కనిపించాయి.
కరుణాకరన్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ఈ వింటేజ్ రొమాంటిక్ యాక్షన్ మూవీ, 16 ఏళ్ల తర్వాత కూడా అదే క్రేజ్‌ను కొనసాగిస్తోంది.ఈముఖ్యంగా యూత్ ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే వీకెండ్‌లో కూడా ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























