అడివి శేష్ తన పాన్ ఇండియా చిత్రం ‘డెకాయిట్”తో మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే, ఇది మరో ఇంటెన్స్, ఎమోషన్స్ కూడిన కథగా కనిపిస్తోంది. కొత్త దర్శకుడు షానీల్ డియో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“డెకాయిట్” కథ హరి, జూలియెట్ మధ్య ఉన్న ఇంటెన్స్ బాండింగ్ చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రశాంతమైన జీవితానికి కలలు కంటున్న ఈ జంట జీవితాన్ని, ఒక ద్రోహం పూర్తిగా మార్చేస్తుంది. హరి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కానీ అతని పరారితో కథ మళ్లీ మలుపు తిరుగుతుంది. ఈ సమయంలో జూలియెట్ తన అనారోగ్యంతో ఉన్న కుమార్తె ప్రాణాలను కాపాడటానికి పెద్ద మొత్తంలో డబ్బు కోసం పోరాడుతుంది. ఈ పరిస్థితుల్లో, హరి ప్రేమికుడి నుంచి సర్వైవర్‌గా మారి, జూలియెట్ అవసరాన్ని ఉపయోగించుకుంటూ క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు.
దర్శకుడు షనిల్ డియో కథను చెప్పిన విధానం ప్రత్యేకంగా నిలుస్తుంది. గత జ్ఞాపకాలు, ప్రస్తుత సంఘటనలను కలిపి చూపించే తీరు ట్రైలర్‌లో ఆకట్టుకుంది. అడివి శేష్ కథా రచనలో కూడా భాగం కావడం వల్ల, ప్రేమ, ద్రోహం, సర్వైవల్ మధ్య జరిగే భావోద్వేగాల ఊగిసలాట చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది.
మృణాల్ జూలియెట్ పాత్రలో ప్రేమికురాలిగా, తల్లిగా రెండింటినీ అద్భుతంగా నటించారు. అనురాగ్ కశ్యప్ కూల్, టెర్రిఫిక్ పోలీస్ పాత్రలో కనిపిస్తూ కథకు మరింత టెన్షన్ తీసుకువచ్చారు. ప్రకాష్ రాజ్ తన అనుభవంతో కథకు బలాన్ని ఇచ్చారు. అలాగే సునీల్, అతుల్ కులకర్ణి వంటి నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్‌గా చూసుకుంటే, ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ సినిమాకు రా, స్టైలిష్ లుక్‌ను ఇచ్చింది. జ్ఞాని అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్‌ను మరింత పెంచుతోంది. నిర్మాత సుప్రియా యార్లగడ్డ, కో-ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందింది.
ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం, ట్రైలర్‌కి తగ్గట్టే అడివి శేష్, షానీల్ డియో కలిసి ఒక హై వోల్టేజ్ సినీమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు.
ట్రైలర్ రేజ్ ప్రెస్ మీట్ లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎన్ని మంచి సినిమాలు చేశామనేదే నా లైఫ్ ఫిలాసఫీ. డెకాయిట్ ప్రాణం పెట్టి చేసిన సినిమా. ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కానీ ట్రైలర్‌లో వాటిని బయటపెట్టలేదు. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు. మనసు బద్దలైనప్పుడు మనిషి ఏమి దోచుకుంటాడనే అంశమే ఈ కథలో ప్రధానంగా ఉంటుంది. ఫీలింగ్స్‌పై ఒక మంచి కథ చెప్పాలని ప్రయత్నించాం. ఈ సినిమా కథ లేయర్స్‌గా ఓపెన్ అవుతుంది. ఇది పూర్తిగా ఫీలింగ్స్ ఆధారంగా నడిచే సినిమా. డైరెక్టర్ షానీల్ గురించి చెప్పాలంటే, ఆయన చెప్పేటప్పుడు భోజ్‌పురి కల్చర్ ఫ్లేవర్ కనిపిస్తుంది. అందుకే ఆ కల్చర్‌ని రిప్రజెంట్ చేయడానికి పవన్ సింగ్ ని తీసుకొచ్చాం. మృణాల్ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. సినిమా మొదటి అరగంట తర్వాత ఏం జరుగుతుందో గెస్ చేయడం చాలా కష్టం. అబ్బూరి రవి గారు నాకు గురువులాంటి వారు. పంజా, క్షణం, మేజర్, గూడచారి, డెకాయిట్ గూడచారి 2దాదాపు అన్ని కలిసి పని చేశాం. ఆయన నాకు మంచి గైడ్. మహేష్ బాబు గారితో నాకు పర్సనల్ కనెక్షన్ ఉంది. హరి క్యారెక్టర్ ఎమోషన్ క్యాప్చర్ చేయడానికి ఆయనను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వరంగల్, తిరుపతి సహా అనేక ప్రాంతాలు తిరిగాం. ఇప్పటికే రెండు పాటలు హిట్ అయ్యాయి. పర్ఫెక్ట్ టైమ్‌లో సినిమా తీసుకువస్తున్నాం. ఇది యూనివర్సల్ కథ. చిన్నప్పుడు ఒక ఫంక్షన్‌లో డాన్స్ చేస్తుంటే “నువ్వు పొడుగ్గా ఉన్నావు, డాన్స్ చేయొద్దు” అన్నారు. అప్పటినుంచి నాకు డాన్స్‌పై భయం. కానీ తర్వాత క్రమంగా కాన్ఫిడెన్స్ పెంచుకున్నాను. ఈ సినిమాలో ఒక ఆర్గానిక్ డాన్స్ సీక్వెన్స్ ఉంటుంది.. చాలా అందంగా వచ్చింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























