ది ప్యారడైజ్ 4 గంటల్లోనే $100K… ఓవర్సీస్‌లో నాని మాస్ ర్యాంపేజ్ షురూ

Nani’s The Paradise’ Off to a Massive Start Overseas

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ ఉత్తర అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ చిత్రం ప్రీ-సేల్స్ ప్రారంభమైన కేవలం 4 గంటల్లోనే లక్ష డాలర్ల ($100K+) గ్రాస్‌ను దాటి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించింది.దాంతో అత్యంత వేగంగా ఈ మార్క్ క్రాస్ చేసిన సినిమాగా ది ప్యారడైజ్ రికార్డు సృష్టించింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాని సినిమాకు ఉన్న అపారమైన క్రేజ్‌ను ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మరోసారి స్పష్టం చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుండగా, ఉత్తర అమెరికాలో సెప్టెంబర్ 23 సాయంత్రం నుంచే గ్రాండ్ ప్రీమియర్లు ప్రారంభం కానున్నాయి. ప్రీ-సేల్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడంతో అక్కడ భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో ఓవర్సీస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.రాక్ సార్ట్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేయగా ట్రైలర్ రావాల్సివుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.