ఇటీవలే సంచలన బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ని అందించిన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స, ‘418’తో థియేటర్లకు ఒక విభిన్నమైన హారర్ చిత్రాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న ఈ చిత్రంతో కీర్తన్ నాడగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఆయనే కథను కూడా అందించారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ థ్రిల్లర్ సెన్సార్‌తో సహా అన్ని లాంఛనాలను పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది. పోస్టర్ లో మసక వెలుతురులో నేలపై కూర్చున్న ఒక వ్యక్తి, ‘A’ అక్షరం ఆకారంలో ఉన్న రక్తపు మరకల వైపు తన ఒక చేతిని చాచి ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ నీడల వెలుగు, మసక రంగులు, పాతబడిన ఆకృతులు, స్పష్టంగా కనిపించే గీతలు ఒక టెర్రిఫిక్ గా ఉన్నాయి.
‘418’ సీరియస్ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ సినిమాలోని మెయిన్ సీక్రెన్ ని ఇంకా రివిల్ చేయకుండా, భయానక ప్రపంచం గురించి కొన్ని గ్లింప్స్ అందించింది. ఇప్పుడు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి సిద్ధమవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























