కొన్ని కాంబినేషన్స్ బాక్సాఫీస్ వద్ద అలా నిలిచిపోతాయి. ఒక సినిమా హిట్టయి మళ్లీ అదే కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందంటే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరి రెండో సినిమా కూడా హిట్టయిందంటే? ఇంకేముంది అది లక్కీ కాంబోనే. ఇక మూడో సారి కూడా ఆ కాంబినేషన్ రిపీట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. హీరో, డైరెక్టర్ కు అగ్ని పరీక్ష లాంటిదే. ప్రేక్షకుల హై ఎక్స్ పెక్టేషన్స్ ను ఎలా రీచ్ అవ్వాలా అని వాళ్లు కూడా టెన్షన్ పడుతూనే ఉంటారు. అలా ప్రస్తుతం నాలుగు క్రేజీ కాంబినేషన్లు ఈ ఒత్తిడిని తట్టుకోడానికి సిద్దంగా ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ ఏంటంటే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి, అల్లు అర్జున్-త్రివిక్రమ్, నాని-ఇంద్రగంటి మోహన్ కృష్ణ, అల్లుఅర్జున్-సుకుమార్ కాంబినేషన్లు.
బాలకృష్ణ- బోయపాటి శ్రీను
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు ఎంత పెద్ద ఘన విజయం సాధించాయో అందరికీ తెలుసు. యాక్షన్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిన ఈ సినిమాలు ఒక ట్రెండ్ సెట్ చేశాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది. మరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.
నాని – ఇంద్రగంటి మోహన్ కృష్ణ
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు నాని. ఆ తరువాత మంచి కథలు ఎంచుకుంటూ తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా మంచి నటుడిగా గుర్తింపుతెచ్చుకున్నాడు. ఆ తరువాత ఇదే కాంబినేషన్ లో వచ్చిన ‘జెంటిల్ మన్’ చిత్రం కూడా విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. నాని 25 వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా.. ఈ సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చూద్దాం వీరి హ్యాట్రిక్ ఏమవుతుందో?
త్రివిక్రమ్ – అల్లుఅర్జున్, సుకుమార్-అల్లు అర్జున్
‘నా పేరు సూర్య’ సినిమా నిరాశపరచడంతో కొంత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఓ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. గతంలో త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి హిట్టు కొట్టాయి. ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది.
ఇక తాజాగా బన్నీ మరో సినిమాను కూడా ప్రకటించాడు. అల్లు అర్జున్ 20వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నట్టు శివరాత్రి సందర్భంగా అఫీషియల్ గా పోస్టర్ ద్వారా తెలిపాడు. ఆశ్చర్యం ఏంటంటే.. సుక్కు-బన్నీ కాంబో కూడా మూడోసారి రిపీట్ అవుతుంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ఆర్య, ఆర్య2 సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. అలాంటి కాంబో మళ్లీ రిపీట్ అవ్వబోతుంది. మరి వీళ్లిద్దరిలో బన్నికి ఎవరితో హ్యాట్రిక్ పడుతుందో చూడాలి.
మరి ఈ కాంబినేషన్స్ అన్నీ హ్యాట్రిక్ కొడతాయా? ఏ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుందో మీ ఓటు ద్వారా తెలపండి.
[youtube_video videoid=eOD1Q8_qbpc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: