యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చారిత్రక చిత్రం ‘స్వయంభు’ నుండి మొదటి పాట (ఫస్ట్ సింగిల్) అప్డేట్ వచ్చేసింది. హోలీ పండుగను పురస్కరించుకుని చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో నిఖిల్ ఒక పరాక్రమవంతుడైన యోధుడిగా కనిపిస్తున్నారు. హోలీ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్లో నిఖిల్ లుక్ ఆకట్టుకుంది. “ఫస్ట్ సింగిల్ లోడింగ్” అంటూ మేకర్స్ ఒక కలర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ, త్వరలోనే పాట విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఈనెలరెండో వారంలో ఈ పాటను విడుదలచేయాలని చూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈసినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి ఈ భారీ హిస్టారికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, ఇప్పుడు రాబోయే మొదటి పాట ప్రమోషన్లను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























