రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంలోని సెకండ్ సింగిల్ రై రై రారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకుని టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పాట తెలుగు వెర్షన్ కేవలం ఒక్క రోజులోనే 31 మిలియన్లకు పైగా వ్యూస్ మరియు 530 వేలకు పైగా లైక్స్ సాధించింది. దాంతో 24గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సాంగ్ గా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇంతకుముందు పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి 30 మిలియన్ల వ్యూస్ తో ఈ జాబితాలో ఉండగా తాజాగా అదే సినిమాలోని సెకండ్ సింగిల్ ఈ రికార్డు బ్రేక్ చేయడం విశేషం.మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ పాటపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే, ఇప్పుడు ఈ వ్యూస్ ప్రభంజనం మెగా అభిమానుల జోష్‌ను మరింత పెంచింది.
ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ఈ రేంజ్ రెస్పాన్స్‌కు ప్రధాన కారణం. ఈ భారీ విజయోత్సాహంతో చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని కూడా మరోసారి స్పష్టం చేసింది. ‘పెద్ది’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026, ఏప్రిల్ 30న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























