హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాండ్ మేళం’. ఇక ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ, చిత్ర యూనిట్ స్పష్టతనిచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీకే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను 2026, మార్చి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి అధికారికంగా ధృవీకరించారు. నిన్నటి నుంచి విడుదల వాయిదా వార్తలు షికారు చేసినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో మేకర్స్ అదే తేదీని ఖరారు చేశారు.
సంగీతం, ప్రేమ మరియు వినోదాల మేళవింపుగా రాబోతున్న ఈ సినిమా, ప్రేక్షకులకు ఒక గ్రాండ్ సెలబ్రేషన్‌ను అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.సతీష్ జవ్వాజి డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో సాయికుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
కోర్ట్ కాంబినేషన్ కావడం అలాగే ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో బ్యాండ్ మేళం పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక రేపు ఈసినిమానుండి రాజమ్మ అనే సాంగ్ విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























