తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘ఓం శాంతి శాంతి శాంతిః డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం మార్చి 4, 2026 నుండి స్ట్రీమింగ్ కానుంది. అయితే, ‘ఆహా గోల్డ్’ సబ్స్క్రైబర్లకు ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ, సాధారణ విడుదల కంటే 24 గంటల ముందే, అంటే మార్చి 3 నుంచే ఈ సినిమాను వీక్షించే అవకాశం కల్పించారు.
మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘జయ జయ జయ జయహే’ చిత్రానికి అధికారిక రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. ఒక సాధారణ మధ్యతరగతి యువతి, పెళ్లయ్యాక భర్త అహంకారం మరియు గృహహింసను ఎలా ఎదుర్కొని తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందనే అంశాన్ని దర్శకుడు హాస్యభరితంగా ఈ సినిమాలో చూపించారు. ఇందులో రోహిణి, బ్రహ్మాజీ, శ్రీలక్ష్మి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























