నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు సరికొత్త సర్ప్రైజ్ లభించింది. నాని నెక్స్ట్ సినిమా నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ది పారడైజ్ తర్వాత ‘ఓజీ’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో ఒక మూవీ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. లవ్ అండ్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఒక నెం.1 చెఫ్ రూత్ లెస్ గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు? అనే కథాంశంతో తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. నిజానికి డీవీవీ బ్యానర్ లో చేయాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో చేతులు మారింది. దీనిని నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇక నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ చేస్తున్నాడు. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈరోజు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో నాని 1960ల నాటి పవర్ ఫుల్ లీడర్ పాత్రలో కనిపించనున్నారు.
కాగా, హీరో నాని ఎప్పుడూ తన పాత్రల్లో వైవిధ్యాన్ని కోరుకుంటారు. ‘దసరా’ సినిమాతో తనలోని మాస్ యాంగిల్‌ను చూపించిన ఆయన, ఇప్పుడు బ్లడీ రోమియో మరియు ది ప్యారడైజ్ చిత్రాలతో మాస్ ఫాలోయింగ్ మరింతగా పెంచుకోనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























