యంగ్ డైరెక్టర్ , నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాయపడ్డ సింహం’. టైటిల్ తోనే ఇంట్రెస్టింగ్ ను కలిగించింది ఈసినిమా. ఇక ఈరోజు టీజర్ ను కూడా విడుదలచేశారు మేకర్స్. “నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!” అనే వెరైటీ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ టీజర్ నవ్వులు పూయిస్తోంది.టీజర్ మొత్తం తరుణ్ భాస్కర్ మార్కు సెటైరికల్ కామెడీతో సాగింది. ముఖ్యంగా ఆయన గత చిత్రం ‘పెళ్లి చూపులు’పై వేసుకున్న సెల్ఫ్ రోస్ట్ జోకులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో అమెరికా వెళ్లాలనుకోవడం, ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అతడు ఎదుర్కొన్న వింత పరిస్థితులు ఈ సినిమా కథాంశమని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇదొక పొలిటికల్ సెటైర్, క్రైమ్ కామెడీ కలగలిసిన ఎంటర్టైనర్గా ఉండబోతోంది.తరుణ్ భాస్కర్‌కు జోడీగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో మెరిశారు.
ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, పవన్ సాదినేని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్ అగస్తీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ లోని ఫన్ మోడ్‌ను బాగా ఎలివేట్ చేసింది.కేవలం ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. తరుణ్ భాస్కర్ తన సహజమైన నటనతో మరోసారి మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























