ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ 

First Single Update From The Paradise

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, షూటింగ్ ఫ్లోర్ నుంచి తాజా అప్‌డేట్‌తో భారీ హైప్‌ను సృష్టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వందలాది మంది డ్యాన్సర్స్ కూడిన భారీ సెట్‌లో నాని బ్లాస్టింగ్ ఇంట్రో సాంగ్ ఆయా షేర్ షూటింగ్ ని టీం ప్రారంభించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ గ్రిట్, హై-అడ్రినలిన్ వైబ్‌లతో నిండిన ఎలక్ట్రిఫైయింగ్ మాస్ బ్యాంగర్‌ అందించారు. రా ఎనర్జీతో నాని డ్యాన్స్ స్టైల్‌కు ఇది పర్ఫెక్ట్ సాంగ్.నాని బర్త్ డే సందర్భంగా ఈనెల 24న ఈపాటను విడుదలచేయాలని చూస్తున్నారు.

విజయ్ ‘జన నాయగన్’ కు పని చేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్, షార్ప్ మూవ్స్, పవర్‌ఫుల్ ఫార్మేషన్స్‌తో ఈ పాటను గూస్‌బంప్స్ కలిగించే విజువల్ స్పెక్టకిల్‌గా మలుస్తున్నారు. నాని ట్రేడ్‌మార్క్ మాడ్‌నెస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ తో ఈ పాట అద్భుతంగా వుంటుంది.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిర్మాణంలోని ప్రతి అంశంలోనూ ప్రతిష్టాత్మకంగా ది ప్యారడైజ్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.

సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తారు అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.  ఈ చిత్రం ఎనిమిది భాషలలో పాన్-వరల్డ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.