ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం – దిల్ రాజు

Gaddar Awards Ceremony to Be Held on Ugadi Says FDC Chairman Dil Raju

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మార్చి 19న ఘనంగా నిర్వహించనున్నామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు ఈరోజు మరో సారి వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని ఉగాది పండుగ రోజైన మార్చి 19, 2026న అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరాన్ని భారతీయ సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ మీడియా సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ .. ఈరోజు నుండి స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ అవార్డుల కోసం 90 సినిమాలు పోటీ పడనున్నాయి. ఇందులో 68 ఫిచర్ ఫిలిమ్స్ అలాగే ఇవి కాకుండా షార్ట్ ఫిలిమ్స్ అలాగే మరి కొన్ని సినిమాలు వున్నాయి. సో జ్యూరీ మెంబెర్స్ మార్చి 5 లోపు ఇవ్వన్నీ కంప్లీట్ చేసి ఇవ్వాలి. మార్చి 19న ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలియజేశారు.

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు ఈ అవార్డుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జ్యూరీ సభ్యులుగా తనికెళ్ల భరణి, మణిశర్మ, కె.ఎస్. రామారావు, రోజా రమణి వంటి ప్రముఖులు వ్యవహరిస్తున్నారు.

ఈ ఏడాది నుండి సామాజిక సందేశంతో కూడిన చిత్రాలకు (Feature Film on Social Message) ప్రత్యేక కేటగిరీని చేర్చారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు మరియు సి. నారాయణ రెడ్డి పేరుతో కొత్త పురస్కారాలను కూడా అందించబోతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.