మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) విడుదల తేదీలో తాజాగా మార్పులు జరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27, 2026న విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే, షూటింగ్ మరియు నిర్మాణ పనులు ఇంకా మిగిలి ఉండటంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30, 2026న (గురువారం) మే డే వీకెండ్ కానుకగా విడుదల కానుంది.
‘పెద్ది’ విడుదల వాయిదా పడటంతో, గతంలో అనుకున్న మార్చి చివరి వారాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి కేటాయించారు. ఆ సినిమా మార్చి 26న విడుదల కాబోతోంది.
పెద్దిలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు మరియు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్‌తో సెన్సేషన్ సృష్టిస్తోంది.త్వరలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























