పెద్ది స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో పవన్ స్టైలిష్ లుక్ లో కనిపించారు.అయితే ఆ డేట్ కు సరిగ్గా ఒక్క రోజు ఆలస్యంగా మార్చి 27న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడింది. ఇప్పటికే ఉస్తాద్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఆ స్థానంలో బరిలోకి దిగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మార్చి 26న మరో భారీ మూవీ ది ప్యారడైజ్ కూడా విడుదలకావాల్సి వుంది. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న ప్రకారం ఆ సినిమాకూడా వాయిదాపడనుంది. సో ఉస్తాద్ సోలోగా థియేటర్లోకి రానుంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ఫస్ట్ సింగల్ భారీ వ్యూస్ సాధించాయి. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్ళీ వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల ,రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అషుతోష్ రాణా, నవాబ్ షా, పార్థిబన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.