మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మారెమ్మ’ . ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టీజర్ ఈరోజే విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో ప్రబలిన ఒక వింత వ్యాధి, దాని వల్ల చనిపోతున్న ప్రజలు మరియు పశువుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. గ్రామ దేవత ‘మారెమ్మ’ తల్లికి మొక్కుకుంటే ఆ వ్యాధి తగ్గుతుందని గ్రామస్తులు నమ్ముతుండగా, ఆ అమ్మవారికి కాపలాగా ఉండే పవిత్రమైన దున్నపోతు అకస్మాత్తుగా మాయమవుతుంది. దానిని కాపాడే బాధ్యతను హీరో ఎలా తీసుకున్నాడు, ఆ క్రమంలో ఎదురైన అడ్డంకులు ఏమిటి అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.
దర్శకుడు మంచాల నాగరాజ్ ఈ చిత్రాన్ని ఒక రగ్గడ్ రూరల్ మాస్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దారు. మాధవ్ తన తొలి చిత్రంతోనే ఊరమాస్ లుక్‌లో, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో మాధవ్ సరసన దీపా బాలు కథానాయికగా నటిస్తుండగా, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ టీజర్‌ను మరింత గంభీరంగా మార్చాయి. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 15న విడుదలచెయ్యాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























