తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 55 వ చిత్రం లో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈసినిమా కోసం ఇప్పటికే శ్రీ లీల ను హీరోయిన్ గా తీసుకోగా తాజాగా సాయి పల్లవిని మరో హీరోయిన్ గా తీసుకున్నారు. నిన్న చిత్ర నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిలింస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.’మారి 2′ తర్వాత ధనుష్ మరియు సాయి పల్లవి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ధనుష్ మరియు రాజ్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా. అలాగే సాయి పల్లవికి కూడా రాజ్‌కుమార్‌తో ఇది రెండో సినిమా.
ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్టులోకి ఇద్దరు టాలెంటెడ్ హీరోయిన్లు ఉండడంతో సినిమాపై అప్పుడే హైప్ క్రియేట్ అయ్యింది.’కచ్చి సేర’ ఫేమ్ సాయి అభ్యంకర్ ఈసినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిలింస్ మరియు ఆర్-టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది.ఈ ఏడాది చివర్లో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























