మన శంకర వర ప్రసాద్ గారు .. నార్మల్ రేట్లకే టికెట్లు

Mana Shankara Vara Prasad Garu Tickets Available at Normal Prices from Today Onwards

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి, చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.సంక్రాంతి సెలవులు ముగిశాక కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఫ్యామిలీ ఆడియన్సు నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈసినిమా ఇంకా చూడని వారికీ అలాగే మరోసారి చూద్దాం అనుకునే వారికీ గుడ్ న్యూస్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పండుగ సందర్భంగా గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పెంచిన టికెట్ ధరల గడువు ముగిసింది. దీంతో నేటి నుండి అన్ని థియేటర్లలో సాధారణ (రెగ్యులర్) ధరలకే టికెట్లు లభించనున్నాయి.టికెట్ ధరలు తగ్గడంతో రాబోయే రోజుల్లో ఈ సినిమాకు ప్రేక్షకాదరణ మరింత పెరిగే అవకాశం ఉందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. కేవలం స్వదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా అదరగొడుతోంది, ఇప్పటికే 4.2 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి 5 మిలియన్ క్లబ్ వైపు దూసుకుపోతోంది.

మరోవైపు, ఈ చిత్రం సాధిస్తున్న అద్భుత విజయంపై పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. చిరంజీవి అద్భుతమైన సినీ ప్రస్థానంలో ఇది మరో మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. చిరంజీవి, వెంకటేష్ ఒకే తెరపై కనిపించడం ప్రేక్షకులకు అపూర్వ ఆనందాన్ని ఇచ్చిందని, అనిల్ రావిపూడి టేకింగ్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమా విజయానికి ప్రధాన కారణాలని ప్రశంసించింది. బాక్సాఫీస్ వద్ద తన అన్నయ్య సాధించిన ఈ మెగా బ్లాక్‌బస్టర్ విజయం పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.