ఎస్. జానకి కుమారుడు అస్తమయం

Legendary Singer S. Janaki’s Son Passes Away

దక్షిణాది సంగీత సరస్వతి, లెజెండరీ గాయని ఎస్. జానకి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ మరియు సంగీత లోకం దిగ్భ్రాంతికి గురైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మురళీకృష్ణ కేవలం జానకి గారి కుమారుడిగానే కాకుండా, కళారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన సుప్రసిద్ధ భరతనాట్య కళాకారుడు మరియు నటుడు కూడా. తెలుగులో ‘వినాయకుడు’, ‘మల్లెపువ్వు’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా, మలయాళ చిత్రం ‘కూలింగ్ గ్లాస్’ కు కథా రచయితగా కూడా పనిచేశారు. ఎస్. జానకి గారు తన కుమారుడితోనే కలిసి ఉండేవారు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు, కళ్లముందే కొడుకును కోల్పోవడం తీరని లోటుగా మిగిలిపోయింది.

ప్రముఖ గాయని కె.ఎస్. చిత్ర సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. “జానకి అమ్మ గారి ఏకైక కుమారుడు మురళీ అన్న ఆకస్మిక మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. ఈ కష్ట సమయంలో జానకమ్మకు ఆ భగవంతుడు అపారమైన ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు. మురళీకృష్ణకు భార్య ఉమా మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు మరియు అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.