మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక రాజకీయ చిత్రం ‘లెగసీ’ నుండి హీరోయిన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్, తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న కథానాయికను రివీల్ చేస్తూ ఆమె బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో కన్నడ భామ ఏక్తా రాథోడ్ హీరోయిన్గా ఎంపికయ్యారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని ఖరారు చేశారు. ఏక్తా రాథోడ్ ఈ ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాలో ఒక కీలకమైన మరియు గ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.
‘పిండం’ ఫేమ్ సాయికిరణ్ రెడ్డి దైడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.రక్తమే అధికారాన్ని నిర్ణయించినప్పుడు, రాజకీయం వ్యక్తిగతంగా మారుతుంది” అనే ఇతివృత్తంతో వారసత్వ రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో విశ్వక్ సేన్ ‘సిద్ధార్థ్’ అనే యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. కేవలం హీరో హీరోయిన్లకే పరిమితం కాకుండా, ఈ సినిమాలో రావ్ రమేష్, సచిన్ ఖేడ్కర్, మురళీ మోహన్ మరియు బాలీవుడ్ నటుడు కేకే మీనన్ వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ’96’ సినిమా ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా, కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























