దళపతి విజయ్ ఆఖరి చిత్రంగా భారీ అంచనాల మధ్య రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ సెన్సార్ కార్యక్రమాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) జాప్యం చేస్తుండటంతో చిత్ర నిర్మాణ సంస్థ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.సినిమా విడుదల తేదీకి కేవలం మరో మూడు రోజుల సమయం మాత్రమే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిసెంబర్ 19నే సెన్సార్ సభ్యులు సినిమాను చూసి కొన్ని మార్పులు సూచించగా, చిత్ర యూనిట్ ఆ మార్పులను పూర్తి చేసి రీ-సబ్మిట్ చేసింది. అయినప్పటికీ సర్టిఫికేట్ రాకపోవడంతో, దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా విజయ్ రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) నాయకులు ఈ జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బోర్డు ప్రాథమికంగా ‘U/A’ సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.ఈ సినిమా నిడివి దాదాపు 186 నుండి 193 నిమిషాల (3 గంటల 6 నిమిషాలు) వరకు ఉండబోతోందని తెలుస్తోంది.అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో, హైకోర్టు రేపు దీనిపై విచారణ చేపట్టనుంది. కోర్టు ఆదేశాలతో సెన్సార్ ప్రక్రియ రేపు సాయంత్రానికి పూర్తయ్యే అవకాశం ఉంది. అలా జరిగితేనే జనవరి 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదల కాగలదు.
దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్ మరియు ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. తెలుగులో ఈసినిమా జన నాయకుడు గా విడుదలకానుంది.అయితే సంక్రాంతికి తెలుగు నుండి ఏకంగా 5 సినిమాలు విడుదలకానుండడం తో జన నాయకుడు భారీ పోటీ ఎదురుకోవాల్సివుంటుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























