ఈ సంక్రాంతికి మన శంకర వర ప్రసాద్ గారు తో పర్ఫెక్ట్ ట్రీట్ రాబోతుంది – సుస్మిత కొణిదెల

Mana Shankara Vara Prasad Garu Set to Be a Perfect Sankranthi Treat says Sushmita Konidela

మెగాస్టార్ చిరంజీవి,  హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు. ఈ సంక్రాంతికి పండుగ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈసినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్‌లు ఇప్పటికే అద్భుతంగా జరుగుతున్నాయి.ప్రతి గ్లింప్స్, పాటలు,  పోస్టర్ అంచనాలను పెంచాయి. ఇక  నిన్నమేకర్స్ తిరుపతిలో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ట్రైలర్ సినిమాపై వున్న అంచనాలను రెట్టింపు చేసింది.దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన మ్యాజిక్ ని చూపించారు. మెగాస్టార్‌ను వింటేజ్, కరిష్మాటిక్ గా చూపడమే కాకుండా, వినోదం–యాక్షన్‌లను సమతూకంగా మేళవించి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను రూపొందించారు.చిరంజీవిని అద్భుతంగా ప్రెజెంట్ చేయడం, వెంకటేష్‌ను కథలో కీలకంగా తీసుకురావడం సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్స్.

ఇక  ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో  నిర్మాత సుస్మిత కొణిదల మాట్లాడుతూ.. గుడ్ ఈవెనింగ్ తిరుపతి. సంక్రాంతికి ట్రీట్ ఎలా ఉండబోతుందో ఈ ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.సినిమా మీకు ఎప్పుడెప్పుడు చూపించాలా అనే ఎక్సైట్మెంట్ ఉంది. ఇది ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్.ఆయన స్టైల్ మా డైరెక్టర్ గారు అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేశారు.దాన్ని ఎలివేట్ చేయడానికి విక్టరీ వెంకటేష్ గారు నయనతార అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు.ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ట్రీట్ రాబోతుంది. అందరూ కూడా సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.