అనిల్ గారు ఈసారి ఇద్దరు హీరోలతో వస్తున్నారు – సాహు గారపాటి

Anil ravipudi Is Coming This Time with Two Heroes Says Sahu Garapati

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో పండుగ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. ఇది అత్యంత క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచింది. సినిమా ప్రమోషన్‌లు ఇప్పటికే అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి గ్లింప్స్, పాటలు, పోస్టర్ అంచనాలను పెంచాయి.ఈరోజు, మేకర్స్ తిరుపతిలో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.ఈ ట్రైలర్ అదిరిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒకప్పుడు దేశ భద్రతా సంస్థల్లో కీలకంగా సేవలందించిన శంకర వర ప్రసాద్, శశిరేఖను ప్రేమించి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కి మారుతాడు. ఫ్యామిలీ మ్యాన్ గా ప్రశాంతంగా కనిపించినా, అతనిలోని వింటేజ్ ఫైర్, నేచురల్ ఇన్‌స్టింక్ట్ మాత్రం ఎక్కడా తగ్గదు. ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు వచ్చినప్పుడు, వాటిని శంకర వర ప్రసాద్ తనదైన స్టైల్‌లో ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ యొక్క ప్రధానాంశం.

నిర్మాత సాహుగారపాటి మాట్లాడుతూ.. ట్రైలర్ అదిరిపోయింది. సినిమా అంతకంటే అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ సంక్రాంతికి మన అనిల్ గారు ఒక హీరోతోనే వచ్చారు. ఈసారి ఇద్దరు హీరోలతో వస్తున్నారు. మనందరం కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి పెరిగిన వాళ్ళమే. ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నామో అనిల్ గారు అంతే అద్భుతంగా చూపించారు. ఈ సినిమా సంక్రాంతికి బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. సినిమా నుంచి చాలా అద్భుతంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం.పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.