మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఫంకీ’ .జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ధీరే ధీరే అంటూ వచ్చిన ఈసాంగ్ బాగుంది. సంజిత్ హెగ్డే ,రోహిణి సొరాత్ పాడగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు అనుదీప్ ఈసినిమాను ఫుల్ ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. విశ్వక్ సేన్ గత చిత్రాల కంటే ఈ సినిమాలో మరింత వైవిధ్యమైన లుక్లో కనిపిస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా వుంది. దాంతో రిలీజ్ డేట్ ను ఛేంజ్ చేశారు. ముందు ఏప్రిల్ 3న రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ సినిమా రెడీగా ఉండడంతో ఫిబ్రవరి 13నే థియేటర్లలోకి రానుంది. నాగవంశీ ,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మిస్తున్నారు.
అనుదీప్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఫంకీ పై మంచి అంచనాలు వున్నాయి.రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా విజయం విశ్వక్ కు తప్పనిసరి కానుంది. తన నుండి రీసెంట్ గా వచ్చిన సినిమాలు ఏవి కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఇప్పుడు ఫంకీ తో విశ్వక్ ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























