సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ అడ్వెంచరస్ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక అధికారిక అప్డేట్ వెలువడింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, వారణాసిలో జరిగిన అద్భుతమైన షెడ్యూల్ ముగిసిందని వెల్లడించారు. “వారణాసి షెడ్యూల్ నాలోని నటుడి ఆకలిని తీర్చింది.రాజమౌళి, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు ప్రియాంక చోప్రా వంటి ప్రతిభావంతులతో కలిసి పనిచేయడం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది” అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఇందులో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా చేస్తున్నారు.ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రం దాదాపు రూ. 1000 – 1300 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతోంది. 2027 వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం ఈ సినిమా సెట్స్‌కు వస్తానని రాజమౌళికి చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో హైప్ నెలకొంది. ఐమ్యాక్స్ వెర్షన్లో వస్తున్న ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























