మా వందే షూటింగ్ షురూ

Shooting Begins for Maa Vande

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా బయోపిక్ రానున్న విషయం తెలిసిందే. మోదీ జన్మదినం సందర్భంగా ఈసినిమాను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలు పెట్టారు.మా వందే అనే టైటిల్ తో ఈ బయోపిక్ తెరకెక్కుతుండగా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇందులో మోదీ పాత్రలో నటిస్తున్నాడు.ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది. క్రాంతి కుమార్ డైరెక్ట్ చేస్తుండగా ఈసినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో భాగంగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ,రవి బస్రుర్ సంగీతం అందిస్తుండగా గా ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ , శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.భారీ బడ్జెట్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ ఈసినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తుంది. వచ్చే ఏడాది చివర్లో ఈసినిమాను విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.అన్ని భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.