సంక్రాంతి సినిమాలు … రోజుకో రిలీజ్

సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌ కి ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీస్ అన్ని థియేటర్లలకు కదిలే పండుగ ఇది.అందుకే ఈ సీజన్ లో ఎక్కువ సినిమాలు రిలీజవుతుంటాయి. గత సంక్రాతికి సంక్రాంతి వస్తున్నాం వచ్చి కలెక్టన్ల వర్షం కురిపించింది.ఇక ఈ సంక్రాంతికి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు సిద్ధమైంది. అగ్ర హీరోల నుండి యంగ్ స్టార్ల వరకు ప్రతిరోజూ ఒక పెద్ద సినిమా విడుదలకు ప్లాన్ చేస్తుండటంతో, థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొననుంది. జనవరి 12నుండి 15వరకు రోజుకో సినిమా లెక్కన బరిలోకి దిగనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో మొదటగా వస్తుంది మన శంకరవరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి- దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ తోడవడంతో ఈ చిత్రం సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి వస్తుంది. మాస్ మహారాజా రవితేజ మార్క్ వినోదంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి రానుంది.కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామాగా ఉండబోతోంది.నిన్న రిలీజైనా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకుంటుంది.హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయనుంది.

ఇక సరిగ్గా పండుగ రోజున యంగ్ హీరోలు బరిలోకి దిగుతున్నారు. అందులో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు అలాగే శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి తో వస్తున్నారు. అనగనగా ఒక రాజు జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుండగా నారీ నారీ నడుమ మురారి మాత్రం అదే రోజు సాయంత్రం 5:49 గంటలకు స్పెషల్ ప్రీమియర్లతో వినూత్నంగా విడుదల కానుండటం గమనార్హం.ఆ లెక్కన నారీ నారీ నడుమ మురారి జనవరి 15న గ్రాండ్ గా విడుదలవుతున్నట్లు. ఈ రెండు చిత్రాలు కూడా యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నాయి.మరి ఈసినిమాల్లో ఏది సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.