వారణాసి పుణ్యక్షేత్రంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతుండటంతో, ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి బాలయ్య..కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.ఆధ్యాత్మిక నగరమైన కాశీలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా గంగా హారతిలో పాల్గొన్న బాలయ్యను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ, అఖండ 2 లో తాను సనాతన సైనికుడి గా నటించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.నేటి తరం యువత సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని, దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.ఈ సినిమాలో సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేలా ఉన్న అంశాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు.కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఒక మంచి సందేశంతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఆనందంగా ఉందన్నారు.
డిసెంబర్ 12న విడుదలైన అఖండ 2 మొదటి వారంలోనే కలెక్షన్ల సునామీ సృష్టించి బాలయ్య కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రానికి థమన్ అందించిన నేపథ్య సంగీతం అదనపు బలంగా నిలిచింది.సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్ర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం,అఘోర అవతారంలో బాలయ్య విశ్వరూపాన్ని చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























