ఓటీటీలోకి వచ్చేసిన రాజు వెడ్స్ రాంబాయి

Raju Weds Rambai Now Streaming on OTT

అఖిల్ రాజ్ మరియు తేజస్విని రావు జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ గ్రామీణ ప్రేమకథ ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఈరోజు నుండి ఓటీటీలో సందడి చేస్తోంది.తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు సాయిలు కంపాటి ఈసినిమాను తెరకెక్కించాడు. కేవలం రూ. 2.5 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిన్న సినిమా గత నెలలో థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 17 కోట్లకు పైగా వసూళ్లతో సూపర్ హిట్ అనిపించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్లో ఈ సినిమా నేటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ వెర్షన్ కంటే భిన్నంగా, ఓటీటీలో ఈ సినిమా ‘ఎక్స్‌టెండెడ్ కట్’ (Extended Cut) వెర్షన్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో చూడని మరికొన్ని అదనపు సన్నివేశాలను జోడించి ఈ వెర్షన్‌ను విడుదల చేశారు.ఇంటివద్దే థియేటర్ అనుభూతిని ఇచ్చేలా 4K క్వాలిటీతో పాటు డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నారు.

కథా: మండలి వాయించే బృందంలో డ్రమ్మర్‌గా పనిచేసే రాజు (అఖిల్ రాజ్), ఒక కాంపౌండర్ కుమార్తె అయిన రాంబాయి (తేజస్విని) మధ్య చిగురించిన ప్రేమకథ ఇది. వీరి ప్రేమకు సామాజిక అంతస్తులు, పరువు మరియు అహం ఎలా అడ్డంకిగా మారాయి అనే అంశాలను దర్శకుడు ఎంతో హృద్యంగా చూపించారు. ముఖ్యంగా సినిమాలో విలన్ పాత్రలో నటించిన చైతు జొన్నలగడ్డ (సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు) నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. వేణు ఊడుగుల మరియు రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ప్రధాన అక్షరణ గా నిలిచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్


మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.