డెకాయిట్ టీజర్ రిలీజ్ 

DACOIT Teaser Released

అడివి శేష్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా డెకాయిట్ టీజర్ విడుదలయ్యింది.హైదరాబాద్‌లోని ‘AAA సినిమాస్’లో తెలుగు టీజర్‌ను విడుదలచేశారు. అలాగే హిందీ టీజర్ ను ముంబైలోని ‘గైటీ గ్యాలక్సీ’ థియేటర్‌లో లాంఛ్ చేయనున్నారు. ఇక ఈ టీజర్అదిరిపోయింది.యాక్షన్ ప్యాక్డ్  గా కట్ చేసిన ఈ టీజర్  సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. టీజర్ లో కింగ్ నాగార్జున ఐకానిక్  సాంగ్ కన్నెపెట్టరో .. కన్ను కొట్టరో సాంగ్  కూడా బ్యాక్ గ్రౌండ్ లో వినిపించింది. ఈసినిమాలో  ఆ సాంగ్ రీమిక్స్ చేసినట్లున్నారు. ఇక అడివి శేష్ ఫస్ట్ టైం కెరీర్ లో రాయలసీమ స్లాంగ్ లో  డైలాగులు చెప్పాడు. ఓవరాల్ గా టీజర్ అయితే  ప్రామిసింగ్ గా అనిపించింది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు.పాపులర్ సినిమాటోగ్రాఫర్ షానిల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా  మాజీ ప్రేమికుల మధ్య జరిగే ప్రతీకార నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ మరియు సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాందించుకోవడంతో తన తరువాతి సినిమా డెకాయిట్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది మార్చి 19న ఈసినిమా విడుదలకానుంది.   

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.