డేవిడ్ రెడ్డి గ్లింప్స్ రిలీజ్

Glimpse from David Reddy Is Out

చాలా గ్యాప్ తరువాత మంచు మనోజ్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం డేవిడ్ రెడ్డి. ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. హనుమరెడ్డి ఎక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మంచు మనోజ్ కెరీర్‌లో ఒక పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ మూవీగా కనిపిస్తోంది. ఇటీవలే ‘మిరాయి’ చిత్రంలో తన నటనతో మెప్పించిన మనోజ్, ఇప్పుడు ఈ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ గ్లింప్స్‌లో ఆయన షార్ట్ హెయిర్ స్టైల్‌తో ఎంతో స్టన్నింగ్‌గా కనిపిస్తున్నారు.ఈ చిత్ర కథా నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది. బ్రిటిష్ కాలంలో జరిగిన జలియన్ వాలా బాగ్ మారణకాండ సమయంలో ఏమాత్రం వెనకాడని ఒక ధైర్యవంతుడైన డేవిడ్ రెడ్డి అనే వ్యక్తి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బ్రిటిష్ వారికి ఒక కంటిలో నలుసుగా మారిన డేవిడ్ రెడ్డిని వారు దేశద్రోహిగా ముద్ర వేయడం వంటి అంశాలను ఈ గ్లింప్స్‌లో చూపించారు.

ఇది ఒక విప్లవాత్మకమైన కథ అని, ఈ చిత్రం తమందరికీ గర్వకారణంగా నిలుస్తుందని మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోతుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటం విశేషం. ఆయన అందించిన మ్యూజిక్ గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ఈ చిత్రం మంచు మనోజ్ అభిమానులకు ఒక మాస్ యాక్షన్ ట్రీట్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.