సూపర్ స్టార్ట్ మహేష్ బాబు నటించిన కల్ట్ ఫ్యామిలీ మరియు సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘మురారి’ మరోసారి రీ-రిలీజ్ కానుంది.ఈ ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి, రీ-రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఈ చిత్రాన్ని వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మురారి సినిమాకు ఉన్న ప్రత్యేకత దాని కథాంశం మరియు పాటలు. మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. ఈ చిత్రంలోని భావోద్వేగాలు, అద్భుతమైన క్లైమాక్స్ మరియు మహేష్ బాబు నటన ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. ముఖ్యంగా 4K క్వాలిటీతో మరియు మెరుగైన సౌండ్ సిస్టమ్‌తో ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయడంతో సరికొత్త అనుభూతిని ఇచ్చింది.
ఇక ఇప్పుడు 2026 న్యూ ఇయర్ రోజున మురారి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.సెలెక్టెడ్ థియేటర్లలో స్పెషల్ షోస్ వేయనున్నారు. ఇది మహేష్ బాబు అభిమానులకు ఇది ఒక గొప్ప పండుగ లాంటి వార్త.మురారిని కృష్ణవంశీ డైరెక్ట్ చేయగా సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది.
ఇక మహేష్ బాబు తన తర్వాతి ప్రాజెక్ట్ (SSMB29) వారణాసి తో బిజీగా వున్నాడు.అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో టైటిల్ తోపాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఒక్క గ్లిమ్ప్స్ తో సినిమామీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2027 వేసవిలో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























