వారణాసి సెట్ కి రావాలని వుంది – జేమ్స్ కామెరూన్

Rajamouli in Conversation with James Cameron Goes Viral

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మధ్య జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. హాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం అవతార్ 3 – ఫైర్ అండ్ యాష్ ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ కలిసి ముచ్చటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న అవతార్ పార్ట్ 3 – ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రం ఇండియాలో కూడా భారీ స్థాయిలో ప్రమోట్ చేయబడుతోంది. ఇందులో భాగంగా, దర్శకుడు జేమ్స్ కామెరూన్ రాజమౌళితో ఒక ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సంభాషణలో రాజమౌళి తన అనుభవాలను పంచుకుంటూ, తొలిసారి అవతార్ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్‌లో నేను ఒక చిన్న పిల్లాడిలా మైమరిచిపోయాను. హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్‌లో ఆ సినిమా దాదాపు ఒక సంవత్సరం పాటు ఆడింది అని జేమ్స్ కామెరూన్ కు వివరించారు. అవతార్ ఫ్రాంచైజీ అనేది వెండితెరపై గొప్ప అనుభూతిని ఇచ్చే సినిమాలకు ఒక బెంచ్‌మార్క్ అని ఆయన ప్రశంసించారు.

జేమ్స్ కామెరూన్ కూడా రాజమౌళి సినిమాటిక్ విజన్ పట్ల ప్రశంసలు కురిపించారు. భారతీయ సినిమాల స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ముఖ్యంగా మీరు తీసే చిత్రాలు గ్లోబల్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.నేను మీ వారణాసి సెట్స్‌కు వచ్చి, మీరు సృష్టించే మ్యాజిక్‌ను చూడాలనుకుంటున్నాను. మీరు నాకు ఒక కెమెరా ఇస్తే, నేను దానిని ఆపరేట్ చేస్తాను. మీ కోసం కొన్ని షాట్స్ కూడా తీస్తాను అని కామెరూన్ అడుగగా ..

అది నాకు దక్కే గొప్ప గౌరవం సార్. మీకు సాదర స్వాగతం.కేవలం నేను మాత్రమే కాదు, మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ (TFI) ఎంతో ఉత్సాహపడుతుంది. నేను మిమ్మల్ని హైదరాబాద్‌కు, నా షూటింగ్ సెట్స్‌కు తీసుకువస్తాను అని రాజమౌళి అన్నారు.

ప్రపంచ స్థాయి దర్శకులు ఇద్దరు కలిసి సినిమా గురించి, సాంకేతికత గురించి చర్చించుకోవడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రెండు విభిన్న సినీ పరిశ్రమలను కలిపేలా సాగిన ఈ ఇంటర్వ్యూ ‘అవతార్ 3’ పై భారతీయ ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.