సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తన తండ్రి, దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద ఉన్న గుడివాడలోని ఏఎన్నార్ కళాశాలకు భారీ విరాళాన్ని ప్రకటించడం ద్వారా తన పెద్ద మనసును చాటుకున్నారు. ఈ కళాశాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనుషులు శాశ్వతం కాదని, మనం చేసే పనులు మాత్రమే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ విరాళం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే తమ కుటుంబ ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ వజ్రోత్సవాల్లో నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన కళాశాలలోని ‘రూసా’ భవనాన్ని ప్రారంభించి, తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలో ప్రసంగిస్తూ, తన తండ్రికి విద్య పట్ల ఉన్న అపారమైన గౌరవాన్ని నాగార్జున గుర్తు చేసుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు గారు స్వయంగా పెద్దగా చదువుకోకపోయినా, చదువుకున్న వారిని ఎంతగానో గౌరవించేవారని, అందుకే 1959లోనే ఈ కళాశాల స్థాపన కోసం రూ. 1 లక్ష విరాళం అందించారని తెలిపారు. ఆనాడు ఆయన చేసిన ఆ సాయమే నేడు వేలాది మంది విద్యార్థులు విద్యావంతులు కావడానికి పునాది వేసిందని కొనియాడారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























