దేఖ్ లేంగే సాలాకు రికార్డు వ్యూస్ 

Dekh Lenge Saala from Ustaad Bhagat Singh Clocks Record Views

గబ్బర్ సింగ్ తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో  డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో  ఉస్తాద్ భగత్ సింగ్  పై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటికే పవన్ తన  పాత్ర తాలూకు షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ఇక ఈసినిమాకు వున్న హైప్ ను ఒక్కసారిగా డబుల్ చేసింది. ఈసినిమా నుండి  ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా రెండు రోజుల క్రితం విడుదలైన ఈ పాట సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే విడుదలైన  ఈ సాంగ్   24 గంటల్లో  29.6 మిలియన్ల వ్యూస్ తో రికార్డు బ్రేకింగ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కి తోడు పవన్ స్టైలిష్ లుక్స్  లిరికల్ వీడియో లో  హైలైట్ అయ్యాయి.ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనెలలో సినిమాను కంప్లీట్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేయడానికి  సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పవన్ సరసన శ్రీలీల మరియు రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 

ఇక రీసెంట్ గా ఓజీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్ ఈసినిమా 300కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఈసినిమా తరువాత  ఇప్పటివరకు మరో సినిమాకు  కమిట్ కాలేదు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.