నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ దేశవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా, ఉత్తర భారతదేశంలో ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హిందీ వెర్షన్ విడుదలైన తర్వాత, నార్త్ ఇండియాలోని ప్రేక్షకులు బాలయ్య నటనకు, సినిమాలోని యాక్షన్ ఘట్టాలకు ఫిదా అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అఖండ రుద్ర విశ్వరూపం
సినిమాలోని అఘోరా పాత్రలో బాలకృష్ణ చూపించిన వీరావేశం, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ హిందీ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. దేవుడిపై అపనమ్మకాన్ని సృష్టించి, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునే విలన్లపై అఖండ రుద్ర చేసే ‘తాండవం’ హిందీ ప్రేక్షకులకు అపూర్వమైన సినిమా అనుభూతినిచ్చింది.
బోయపాటి శ్రీను దర్శకత్వం, అత్యుత్తమ నిర్మాణ విలువలు ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఒక ప్యాన్-ఇండియా సంచలనంగా మార్చాయి. బాలయ్య డైలాగులు హిందీలోకి డబ్ అయినప్పటికీ, వాటిలో ఉన్న పవర్, ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గకపోవడం ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, హిందీ మార్కెట్లోనూ ‘అఖండ 2’ సృష్టించిన ఈ కలెక్షన్ల సునామీ.. బాలకృష్ణ స్టామినాను చాటి చెబుతోంది!
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























