అఖండ 2కి బ్లాక్ బస్టర్ టాక్.. రికార్డ్ స్థాయిలో బుకింగ్స్

Akhanda 2 Roars With Blockbuster Talk, Record Bookings Shatters Box Office

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కంప్లీట్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ 2: తాండవం’ భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా విడుడలైంది. పాన్ ఇండియా లెవెల్లో అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ఊహించిన దానికంటే మించిన బ్లాక్‌ బస్టర్ టాక్ సొంతమైంది. సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు బాలయ్య నట విశ్వరూపాన్ని చూసి థియేటర్లలో పండుగ చేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలకృష్ణ నటన మరో స్థాయిలో ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఆయన పలికిన పవర్‌ఫుల్ డైలాగులు, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అంతేకాకుండా, సినిమాలో ప్రస్తావించిన సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది.

ఇక ఎస్. తమన్ అందించిన థండరింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ఈ సినిమా విజయంలో వెన్నెముకగా నిలిచిందని చెప్పొచ్చు. అందుకే, బాలకృష్ణ అభిమానులే కాక, సినీ ప్రియులు కూడా ఈ సినిమాను చూడడానికి అత్యంత ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా, టికెట్ బుకింగ్‌లు గంటగంటకు భారీగా పెరుగుతూ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. చూడబోతుంటే, ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.