గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ 2: తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. ప్రీమియర్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత రామ్ ఆచంట మాట్లాడుతూ.. “ప్రీమియర్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. ప్రీమియర్స్ ద్వారా నైజాం, సీడెడ్, ఆంధ్ర కలిపి రూ.10 కోట్లు గ్రాస్ చేసింది. కర్ణాటకలో కూడా దాదాపు కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్‌లో కోటి రూపాయలు కలెక్ట్ చేసిన నాన్ కన్నడ సినిమాల్లో ఇది ఐదో సినిమా. బుకింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి చాలా అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయి. శుక్రవారం ఈవినింగ్ నుంచి ఫ్యామిలీస్ కూడా యాడ్ అవుతాయి. ఈ వీకెండ్‌కి అదిరిపోయే ఫిగర్స్ చూస్తామని నమ్మకం ఉంది. రిలీజ్ తర్వాత అందరం చాలా హ్యాపీగా ఉన్నాం.”
“ఓవర్సీస్ రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉంది. అక్కడ కూడా బుకింగ్స్ చాలా సాలిడ్‌గా ఉన్నాయి. ఈ వీకెండ్లో కూడా అది కొనసాగుతుంది. అన్ని ఫాస్ట్‌గా ఫిల్లింగ్ అవుతున్నాయి. శని, ఆదివారాల్లో ఇంకా సూపర్‌గా ఉండబోతున్నాయి. గ్రౌండ్ రిపోర్టు చాలా ఎక్సలెంట్‌గా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సినిమాపై బజ్ బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అద్భుతమైన సినిమా తీశారని ప్రశంసిస్తున్నారు.” అని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























