కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈసినిమా నుండి రీసెంట్ గా రిలీజైన మొదటి పాట ‘బెల్లా బెల్లా’ చార్ట్‌బస్టర్‌గా నిలిచి కోటికి పైగా వ్యూస్‌ను సాధించింది. ఇక ఈరోజు ఈసినిమా నుండి ఈరోజు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.ఈ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ ఫీల్ తెప్పించింది.డింపుల్ హయతితో రవితేజ రొమాంటిక్ కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం పీక్ ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ఆకట్టుకుంటున్నాయి. ఈ మెలోడీ డ్యూయెట్‌ను శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ ఆలపించారు. ‘అద్దం ముందు నిలబడి.. అబద్ధం చెప్పలేనే.. నా అద్దం అంటే నువ్వే మరి.. ఈ నిజం దాచలేనే..’ అంటూ సాగే ఈ పాట ఫ్యామిలీ ప్రేక్షకులను, ప్రేమ జంటలను మెప్పించేలా ఉంది.శ్రేయా ఘోషల్ వోకల్స్ సాంగ్ ను రీపీట్ మోడ్ లో వినేలా చేశాయి.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























