నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన ఎమోషనల్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, రష్మిక నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గాను సక్సెస్ అనిపించుకుంది. ఫుల్ రన్ లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నెల రోజుల్లోపే ఓటీటీ లోకి వచ్చేస్తుంది. అందులో భాగంగా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. డిసెంబర్ 5, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది. కేవలం తెలుగులోనే కాకుండా పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
భూమా దేవి పాత్రలో రష్మిక నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో హీరోగా నటించగా, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి కీలక పాత్రలు పోషించారు.హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ధీరజ్ మొగిలినేని ,విద్య కొప్పినీడి నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























