పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి తొలి పాట త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలైన ఈ చిన్న వీడియోలో పవన్ కల్యాణ్ స్టైలిష్ సూట్‌లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్ డ్యాన్స్‌లో మళ్లీ పాత ఎనర్జీని చూడబోతున్నామనే హింట్‌ను ఈ విజువల్స్ ఇచ్చాయి. ఇందులో పవన్ లుక్ అదిరిపోయింది. స్లిమ్ గా చాలా స్టయిలిష్ గా కనిపించాడు.
“మీరు ఇష్టపడే ఎనర్జీ, మీరు ఎంజాయ్ చేసే డ్యాన్స్, మీరు సెలబ్రేట్ చేసుకునే వైఖరి, మీరు ఆరాధించే వ్యక్తి… ఇవన్నీ కలగలిపి ఒక్క పాటలోనే” అంటూ చిత్ర యూనిట్ త్వరలోనే ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈనెల చివర్లో ఈ సాంగ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రాశి ఖన్నా , శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























