అఖండ 2 మ్యాసివ్ తాండవం టీజర్ రిలీజ్

Akhanda 2 Action Teaser Released

నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ విడుదలకు సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 5న భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ అంచనాలను మరింత పెంచేందుకు, నేడు జరుగుతున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్ ఒక పవర్‌ఫుల్ యాక్షన్ టీజర్ ను విడుదలచేశారు.72 సెకండ్ల నిడివి తో వచ్చిన ఈ టీజర్ ను యాక్షన్ సీన్స్ తో నింపేశారు. విజువల్స్ క్వాలిటీ , బీజీఎమ్ ,బాలయ్య డైలాగ్స్ అదిరిపోయాయి. సినిమాలో నాలుగు యాక్షన్ బ్లాక్ లు హైలైట్ అవ్వనున్నాయని సమాచారం. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ పీక్ లో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, ఈ మ్యాసివ్ తాండవం టీజర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.

ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటించగా, బాలీవుడ్ బ్యూటీ హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. యువ నటుడు ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషించాడు.తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.