గ్రాండ్ గా జరిగిన అఖండ Roxx వెహికిల్ లాంచ్ ఈవెంట్

Grand Unveiling of the Akhanda Roxx Vehicle

అఖండ 2 లో హీరో నందమూరి బాలకృష్ణ వాహనాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, X Studios దానికి అద్భుతమైన సినీమాటిక్ లుక్‌ను అందించింది. పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది. నందమూరి బాలకృష్ణ గారి శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెహికిల్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వెహికల్ పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు చూసిన ఏవి వీడియోలో నా సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దాదాపుగా పది వెహికల్స్ ఉన్నాయి. అమర్ గారు అద్భుతంగా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికల్ రాత్రి పగలు కష్టపడి గొప్పగా డిజైన్ చేశారు. అందుకు ఆయనని అభినందించాలి. ఈ వెహికల్ ని యాక్షన్ లో ఎంత అద్భుతంగా వాడుకున్నామో అది మీరు థియేటర్స్ లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. అది మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు.

ఒక పవర్ వున్న క్యారెక్టర్ దిగి వస్తుంటే దానికి తగ్గ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ వెహికల్ కూడా అంత పవర్ ఫుల్ గా ఉంటుంది. మేము కోరుకున్నట్టుగా ఈ వెహికల్ ని చాలా తక్కువ రోజుల్లోనే అద్భుతంగా డిజైన్ చేసి ఇచ్చిన అమర్ కి ధన్యవాదాలు. ఈవెంట్ ని ఎంతో ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. అఖండ2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. అభిమానులు అందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా భారత దేశ ఆత్మ. మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అందరికీ థాంక్యు వెరీ మచ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.