ఈ ఏడాది మాస్ జాతర అంటూ ప్రేక్షకులముందుకు వచ్చిన మాస్ మహా రాజా రవితేజ కు ఈసినిమా అనుకున్న విజయాన్ని అందిచలేకపోయింది. గత నెల చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరించింది. రవితేజకు ఇది 75వ సినిమా.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈరోజు నుండి నెట్ ఫ్లిక్స్ దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించగా తనకు జంటగా శ్రీలీల నటించింది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మించారు.
ఇక ఈసినిమా తరువాత రవితేజ నెక్స్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో రానున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.రీసెంట్ గా విడుదలైన గ్లింప్స్, సినిమాపై అంచనాలను పెంచేసింది.రవితేజ ఈసారి ఫ్రెష్ కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా వస్తున్నాడు.కిషోర్ తిరుముల డైరెక్ట్ చేస్తుండగా ఆషికా రంగనాథ్ ,డింపుల్ హయతి హీరోయిన్లు గా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈసినిమా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.
అయితే ప్రస్తుతం రవితేజ నెక్స్ట్ మూవీ కూడా స్టార్ట్ చేశాడని అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శివ నిర్వాణ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని ప్రచారం జరుగుతుంది.అయితే ఈసినిమా విషయంలో అధికారిక ప్రకటన రావాల్సివుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























