మీరు అందరూ కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వస్తారు –  ఉపేంద్ర   

Andhra King Taluka Will Make Everyone Walk Out With Raised Collars says Upendra

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.  భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి.  ట్రైలర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు.  ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో రామ్ మైండ్ బ్లోయింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అందరినీ మెస్మరైజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ్యూజిక్ కాన్సర్ట్ లో  రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు ఈ సినిమాలన్నీ మీకు గుర్తు ఉండడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చుసిన వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. ఈ సినిమా చూసి మీరు అందరూ కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వస్తారు. మహేష్ గారు సినిమాని అద్భుతంగా చేశారు. ఎలివేషన్ కమర్షియల్ సాంగ్స్ లవ్వు అన్నీ ఉన్నాయి. రామ్ గారు భాగ్యశ్రీ గారు అద్భుతమైన కాంబినేషన్. రామ్ గారి ఎనర్జీ ఈ సినిమాలో చూడండి. మీ ఫ్యాన్స్ అందరి ఎనర్జీ అక్కడ ఉంది. మైత్రి నవీన్ గారికి రవి గారికి చాలా థ్యాంక్యూ. మీ అభిమానానికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.