ఆంధ్ర కింగ్ తాలూకా నాకు చాలా ఎమోషనల్ ఫిలిం – రామ్ పోతినేని 

Hero Ram Pothineni Describes Andhra King Taluka is Very Emotional Film

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.   హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్  ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ కర్నూల్ లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు భారీ సంఖ్యలో ప్రేక్షలులు హాజరయ్యారు. ఈవెంట్ లో డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫైర్ వర్క్స్ ప్రేక్షకులు కట్టిపడేశాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కనీవినీ ఎరుగని రీతిలో కన్నుల పండగలా జరిగింది.

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. “హలో కర్నూల్. ఇప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు చేశాను. కానీ ఇది నాకు చాలా ఎమోషనల్ ఫిలిం. ఈ సినిమాకి ఫీల్ అయినంత ఎమోషన్ ఇంకా ఏ సినిమాకి ఫీల్ అవ్వలేదు.  ఇప్పటివరకు నేను మిమ్మల్ని లైవ్ లో చూడలేదు. నన్ను మీరు చూడలేదు. కానీ ఎప్పుడో కలిసాం అనే ఫీలింగ్ ఉంటుంది. అదే ఈ సినిమా. ఆంధ్ర కింగ్ అనేది నా కెరీర్ లోనే మోస్ట్ పర్సనల్ ఫిల్మ్. ఎప్పటినుంచో నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అద్భుతమైన టీం తో కలిసి చేసిన సినిమా ఇది.”

“మైత్రి రవి గారికి థాంక్యూ.  ఆయన సినిమాని నెత్తి మీదనే పెట్టుకుంటారు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ మర్విన్ తెలుగులో  వన్ అఫ్ ది ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు. నువ్వు ఉంటే చాల్లే చిన్ని గుండెలో సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో నేను అభిమాని పాత్ర పోషించాను. సూపర్ స్టార్ పాత్రని ఉపేంద్ర గారి పోషించారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆ కనెక్షన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఒక స్టార్ అనేవాడు ఎలా ఆలోచిస్తే ఇలాంటి కథ చేయగలడు అనేది ఈ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది అభిమానుల సినిమా.”

“భాగ్యశ్రీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. గ్లామరస్ గా కనిపిస్తూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే హీరోయిన్ తెలుగు సినిమాలో చాలా ఏళ్ల తర్వాత వచ్చిందని భావిస్తున్నాను. తనకి  బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ మహేష్ థియేటర్ కాదు మనలో సౌండ్ వచ్చే సినిమా చేశాడు. అద్భుతమైన సినిమా తీశాడు. తనతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మై డియర్ ఫ్యాన్.. తమ్ముడు.. నువ్వు వున్నావని  నాకు తెలియకపోవచ్చు. కానీ నేనొక్కడినే ఉన్నానంటే కారణం నువ్వే. లవ్ యు కర్నూల్. 27న థియేటర్స్ లో కలుద్దాం. మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకోవడానికి రెడీగా ఉండండి. థాంక్యూ.” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.