విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మకుటం’ సినిమాకు సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. 17 రోజులుగా నిర్విరామంగా షూటింగ్ చేశాం. ఇంటెన్స్‌తో కూడిన ఈ క్లైమాక్స్‌ను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చిత్రీకరించాం. ఓ వార్ సీక్వెన్స్‌కు ఎలాగైతే వందల కొద్దీ స్టంట్ ఆర్టిస్టులతో ఈ క్లైమాక్స్‌ను షూట్ చేశాం. దాదాపు 800 వందల మంది టెక్నీషియన్లతో ఈ షూటింగ్‌ను భారీ ఎత్తున కంప్లీట్ చేశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రా ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్, బ్రీత్ టేకింగ్ యాక్షన్‌లతో ఈ క్లైమాక్స్‌ను నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా చిత్రీకరించాం. విశాల్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ మొదటి సినిమాలో ఆయన పర్ఫామెన్స్ అదిరిపోతుంది. ఇక దిలీప్ సుబ్బరాయన్ వంటి స్టంట్ కొరియోగ్రాఫర్‌తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం.
ఈ 17 రోజుల షెడ్యూల్‌లో ప్రతీ ఒక్కరూ ఎంతో అకుంఠిత దీక్ష, అంకిత భావం, సినిమా పట్ల నిబద్దతతో పని చేశారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద విశాల్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ అంశాలతో రానుందని ప్రెస్ రిలీజ్ లో పేర్కొన్నారు.
‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























